Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 7:46 pm Posted by : ramakrishna

ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

బతుకమ్మ, మోర్తాడ్: సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను పురస్కరించుకొని  మోర్తాడ్ మండలంలో సావిత్రిబాయి పూలే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ ఉత్తమ మహిళా ఉపాధ్యాయులుగా ఎంపికైనఉపాధ్యాయులకు, మండల ఎస్సీ, ఎస్టీ యూనియన్, తెలంగాణ యుటిఎఫ్,యూనియన్ల ఆధ్వర్యంలో,మండల ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను, సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా 194 సంవత్సరాల క్రితం, సావిత్రిబాయి పూలే, ఈ సమాజానికి చేసినటువంటి సేవలను కొనియాడుతూ, సమాజంలో సావిత్రిబాయి పూలేని స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని ముందు నడపాలని వక్తలుకోరారు.  ఈ ఈ  సన్మాన కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు  ఎన్. అశోక్, మండల విద్యాశాఖ అధికారి సమ్మిరెడ్డి, పూర్వ మండల విద్యాశాఖ అధికారి ఎన్. ఆంధ్ర అయ్య, ఎస్సీ, ఎస్టీ, యూనియన్ అధ్యక్షులు రాజేశ్వర్, జనరల్ సెక్రెటరీ రవీందర్, తెలంగాణ యుటిఎఫ్,అధ్యక్షులు దండు గంగాధర్,జనరల్ సెక్రెటరీ బాలరాజు, తెలంగాణ యుటిఎఫ్ జిల్లా మహిళా ఉప అధ్యక్షురాలు శకుంతల, మండలంలోని ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, ఈ కార్యక్రమంలో పాల్గొని సన్మాన గ్రహీతలను సన్మానించడం జరిగింది.