ఐఐటీ విద్యార్థికి ఘన సన్మానం

బతుకమ్మ, కోటగిరి  : పోతంగల్ మండలం జల్లా పల్లి గ్రామానికి చెందిన శ్రీ వేద హై స్కూల్ పూర్వ విద్యార్థి ధరావత్ మమత ఐఐటీలో సీటు సాధించడంతో ఆమెను గ్రామస్తులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సామాజిక కార్యకర్త ఎం ఏ హకీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థినిని పూలమాలలు శాలువాతో సత్కరించి అభినందించారు. గిరిజన పేద కుటుంబంలో జన్మించిన మమత పదవ తరగతిలో మండల టాపరుగా నిలవడం ఇంటర్లో 994 మార్కులు సాధించడం ఐఐటీలో సీటు సాధించడం అభినందనీయమని ఎం ఏ హకీమ్ అన్నారు....