బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం

నిజామాబాద్, బతుకమ్మ :  ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ఆరోపించారు. పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఎటువంటి షరతులు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి బీసీ విద్యార్థులకు షరతులు విధించడం అన్యాయమన్నారు.  బీసీ విద్యార్థులకు పదివేల ర్యాంకు లోపలే వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. పోని ఆ ఫీజు రీయింబర్స్మెంటు కూడ పూర్తిగా ఇవ్వక కేవలం ముప్పై ఐదు వేల...