Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2025, 12:32 pm Posted by : ramakrishna

బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం

నిజామాబాద్, బతుకమ్మ :  ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ఆరోపించారు. పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఎటువంటి షరతులు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి బీసీ విద్యార్థులకు షరతులు విధించడం అన్యాయమన్నారు.  బీసీ విద్యార్థులకు పదివేల ర్యాంకు లోపలే వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. పోని ఆ ఫీజు రీయింబర్స్మెంటు కూడ పూర్తిగా ఇవ్వక కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడం సరికాదన్నారు. గత ప్రభుత్వం మరియు ఈ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి డబ్బులు విడుదల చెయ్యకపోవడంతో బీసీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని జిల్లా కార్యదర్శి పోల్కం గంగాకిషన్ అన్నారు.  ఈ సంవత్సరం నుండే విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చెయ్యాలని నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ అన్నారు. బీసీ సమస్యలను పరిష్కరించకపోతే బీసీ యువత ఆధ్వర్యంలో త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర యువజన కార్యదర్శి కొయ్యాడ శంకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు, పోల్కం గంగాకిషన్, కరిపే రవిందర్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బగ్గలి అజయ్, చంద్రకాంత్, బాలన్న తదితరులు పాల్గొన్నారు.