ఘనంగా యజ్ఞ కార్యక్రమం
బతుకమ్మ, మోర్తాడ్: దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మోర్తాడ్ మండలం శేట్ పల్లీ గ్రామంలో గురువారం దేవీ మండపంలో ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో యజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారు ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో ముదిరాజ్ యువసేన సభ్యులు బొమ్మ శ్రీనివాస్, అరవింద్, రాజేందర్, ప్రవీణ్, నాగాచరణ్, ప్రశాంత్, శరత్, అజిత్ తదితరులు పాల్గొన్నారు.