Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 October 2024, 12:31 pm Posted by : ramakrishna

సిర్నాపల్లిలో ఘనంగా ఊర పండగ

ఇందల్వాయి,బతుకమ్మ: మండల కేంద్రంలోని సిర్నాపల్లిలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో ఆదివారం ఊర పండుగ (పెద్ద పండుగ)ను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పాడిపంటలు బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని వనదేవతలను పూజించారు. అనంతరం పోచమ్మ,మైసమ్మలకు నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ, సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

A grand village festival in Sirnapalli