Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 7:53 pm Posted by : ramakrishna

నాళేశ్వర్ లో ఘనంగా ఊర పండుగ

 

. . . గ్రామ అభివృద్ది కమిటి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు

 

నవీపేట, బతుకమ్మ :

 

నవిపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో ఊరపండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవార్ల విగ్రహాలను కడాలతో ఊరేగింపూగా, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించి గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం గ్రామదేవతలకు భక్తులు ప్రత్యేకపూజలు చేశారు. ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామదేవతలకు బలిహరణ నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ ఆర్ముర్ లావణ్య మాట్లాడుతూ నాళేశ్వర్ గ్రామంలో ఊర పండుగ లో భాగంగా గ్రామంలోని పాడి పశువులు, పాడి పంటలు బాగా పండాలని, గ్రామస్తులంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, మొక్కులు చెల్లించుకొని గ్రామ దేవతలకు ఖుషి పండుగ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి మూడు సంవత్సరాల కు ఒక్కసారి ఈ ఊర పండుగను నిర్వహిస్తామని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఊర పండుగను అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన గ్రామ అభివృద్ది కమిటి కి ధన్య వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ ఆర్ముర్ శ్రీనివాస్, సొసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపిటిసీలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

A grand village festival in Naleshwar