విశిష్ట సేవలు అందించిన వాలంటీర్లు, అభ్యాసకులకు ఘన సన్మానం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మే 25 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా ఉల్లాస్ కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించిన వాలంటీర్లు, అభ్యాసకులను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి డీఆర్‌డీఓ సాయన్న, డీడీ అడల్ట్ ఎడ్యుకేషన్ ఏ. పురుషోత్తం, అదనపు డీఆర్‌డీఓ మధుసూదన్, ఏపీఓ అడల్ట్ ఎడ్యుకేషన్ అరుంధతి, డీపీఎంలు వెంకటేష్, నీలిమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలనకు...