Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2025, 3:41 pm Posted by : ramakrishna

ఆర్డీఓ, పోలీస్ అధికారులకు ఘన సన్మానం

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలో ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టర్,  రెండవ సబ్-ఇన్స్పెక్టర్ ను ఘనంగా సన్మానించారు. సమాజ సమస్యలపై అవగాహన పెంపొందించేందుకు, ముఖ్యంగా ముస్లిం పాళ్ల సమస్యల పరిష్కారాలపై అధికారులతో చర్చించడమై ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశంలో ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్డీఓ, పోలీస్ అధికారులు సానుకూలంగా స్పందించారు. అధికారులు ప్రజలతో సమన్వయంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కమిటీ సభ్యులు వారిని శాలువా కప్పి, స్మృతిచిహ్నాలు అందజేస్తూ సత్కరించారు. కమిటీ అధ్యక్షుడు షేక్ గయాసుద్దీన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ మీర్, ఎండి ముకరం, అజీజ్ ఉర్ రెహమాన్, ఎండి అహ్మద్, అహ్మద్ పాషా, హబీబ్ జానీ, ముజీబ్, యోనస్, తజాముల్, సుమర్, ఖమ్రు, యూసుఫ్, రఫీ, నజీమ్ ఉల్లా, సాబెర్ తదితరులు పాల్గొన్నారు.

A grand tribute to RDO and police officers