బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే కు ఘన నివాళి
నిజామాబాద్, బతుకమ్మ : అణగారినవర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిబా పూలే అహర్నిశలు పాటుపడ్డాడని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని జిల్లా కోర్టు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ గౌడ్ మాట్లాడారు. సత్యశోధక్ సంస్థ ద్వారా అనేక విద్యాలయాలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించిన మహనీయుడు ఫూలే అని కొనియడారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్...