నిజామాబాద్, బతుకమ్మ : అణగారినవర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిబా పూలే అహర్నిశలు పాటుపడ్డాడని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని జిల్లా కోర్టు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ గౌడ్ మాట్లాడారు. సత్యశోధక్ సంస్థ ద్వారా అనేక విద్యాలయాలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించిన మహనీయుడు ఫూలే అని కొనియడారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, న్యాయవాదులు వసంత్ రావు, ఆర్ రాజలింగం, ఏం గోవర్ధన్, పేదంరాజు, కవితా రెడ్డి, అంజలి, లిల్లి కిరణ్ కుమార్ గౌడ్, విఘ్నేష్, వెంకటేష్, విశ్వాక్ సేవ్ తదితరులు పాల్గొన్నారు.