Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 May 2025, 2:35 pm Posted by : ramakrishna

భగీరథ మహర్షికి ఘన నివాళి

కామారెడ్డి, బతుకమ్మ : స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్ విక్టర్ భగీరథ మహర్షి చిత్ర పటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సగర ఉప్పర సంఘం నాయకులు మాట్లాడుతూ భగీరథ మహర్షి గొప్ప యోగి అని పేర్కొన్నారు.  అడిషనల్ కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ భగీరథ మహర్షి బహుజనుల కోసం యాగం చేసి గంగను దివి నుంచి భువి కి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు కొత్తపల్లి మల్లయ్య గారు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, చక్రధర్, సగర ఉప్పర సంఘం జిల్లా నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బంజేపల్లివార్ హన్మాండ్లు, మధు,నరేష్, బీసీ నాయకుడు హన్మాండ్లు,   వసతి గృహ సంక్షేమ అధికారులు నరేష్, పవన్, రాజేశ్వర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.