Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 October 2024, 7:52 pm Posted by : ramakrishna

మోర్తాడ్ మండలంలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

మోర్తాడ్ , బతుకమ్మ::

దేవీ నవరాత్రి ఉత్సవాలను మోర్తాడ్ మండలంలో భక్తులు ఘనంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సంధర్బంగా భవాని మాలలు ధరించి నియమ నిష్ఠలతో భక్తి భావాలను పెంపొందించారు. ఆదివారం చివరి రోజు  మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో కొలువైన అమ్మవారికి భక్తులు 51 నైవేద్యాలతో అర్పణ చేసి అమ్మవారిని ఊయల సేవలో తరించారు.

 

A grand procession of Goddess Durga in Mortad mandal శేట్పల్లి ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దుర్గాదేవి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి విడ్కోలు పలికారు. దుర్గమాత విగ్రహలను స్థానికంగా ఉన్న చెరువులలో, వాగులలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొమ్మ శ్రీనివాస్, అరవింద్, రాజేందర్, ప్రవీణ్, ప్రశాంత్, నాగచైరన్ తదితరులు పాల్గొన్నారు.

A grand procession of Goddess Durga in Mortad mandal