ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఘనంగా దోపోత్సవం
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్భాగంగా 5వ రోజు అశ్వవాహనంపై శ్రీనివాసుడు మాడ వీధుల్లో ఊరేగాడు. శ్రీవారి కళ్యాణం అనంతరం అమ్మవారిని తీసుకెళ్తున్న శ్రీవారిని దోచుకునే ప్రయత్నంలో “చివరి ఆళ్వార్ తిరుమంగై అళ్వారు” వారికి కనువిప్పు కలిగే ఘట్టాన్ని భక్తులు నృత్య రూపంలో చూసి తన్మయత్వనికి లోనయ్యారు. స్వామి వారి కీర్తనలపై ప్రముఖ నృత్య గురువులు విజయలక్ష్మీ ఆధ్వర్యంలో అద్భుతమైన నృత్య రూపకాలను సిద్ధార్థ కళాక్షేత్రం శిష్యులు ప్రదర్శించారు. సినీ నటులు రవి ఈ నృత్య రూపాకాల్లో నటించి భక్తులను అలరించారు....