నిజామాబాద్ లో ఘనంగా గోటి తలంబ్రాల దీక్ష
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శ్రీరామనవమి నాడు కన్నుల పండుగగా జరిగే భద్రాచల రామయ్య కల్యాణానికి తెలంగాణ రాష్ట్రం నుండి 250కిలోల గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్ప దీక్షతో గ్రామ, గ్రామాన శ్రీకారం చుట్టింది గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ. అందులో భాగంగా మంగళవారం నిజామాబాద్ లోని కోటగల్లిలో గల జైర్ కోట్ హనుమాన్ మందిరంలో వందకు పైగా భక్తులు పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు అందజేశారు. వారిచే రామనామ...