Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 9:21 pm Posted by : ramakrishna

ముస్లీం సోదరులకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

రంజాన్ నెల ప్రారంభమై ఉపవాస దీక్షలు (రోజా) నిర్వహించుకుంటున్న తరుణంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ నివాసంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులు రోజా ఉపవాసం దీక్షలు విడిచి మగ్రిబ్ నమాజు చేసిన అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు పార్టీలకతీతంగా దాదాపు 400 మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నార్ల రత్నకుమార్, బి.ఆర్.ఎస్.వి మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా, మహమ్మద్ ఇషాక్, కోనాపూర్ సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

A grand Iftar dinner for Muslim brothers under the auspices of BRS