కోటగిరి, బతుకమ్మ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) వ్యాస మహర్షి జయంతి గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురు పూజోత్సవ గురువుల సన్మాన కార్యక్రమంలో కోటగిరి మండలం నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా తమ్మలి సంతోష్ (ఎస్ జిటి) యుపిఎస్ కొత్తపల్లి, టిపియుఎస్ కోటగిరి మండల శాఖ తరపున ఆదివారం శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పరలి కృష్ణవేణి, కార్యదర్శి బట్టు బద్రీనాథ్, వరప్రసాద్, కర్ణ శంకర్, మండల బాధ్యులు మహాజన నరసింహులు, లోగం రాజేష్ , నూత్ పల్లి విజయ్ తదితరులు పాల్గొన్నారు.