Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2025, 8:28 pm Posted by : ramakrishna

ఎన్జీఎస్ విద్యార్థులకు ఘన సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన సుహావి బన్సల్ 490/500 మార్కులు సాధించి తెలంగాణ టాపర్గా నిలువగా,  బాసెట్టి తన్మై 466/500, హరిజిత్ భౌమిక్ 460/500, మంచెర్ల నిహాన్ రెడ్డి 456 /500, పార్సా లాస్య 444/500 ఉత్తమ మార్కులు  సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను నవ్య భారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ సంతోష్ కుమార్, కరస్పాండెంట్  శ్రీదేవి

A grand honor for NGS students

లు  శాలువా,  పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభకు తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల మార్గనిర్దేశనమే కారణమని వారు కొనియాడారు. బోధనా విధానంలో ప్రతి విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధ, వారిలోని ప్రతిభను గుర్తించి, పద్ధతిగా తయారుచేసే విధానం ఉందనీ ప్రత్యేకంగా ఉపాధ్యాయులు రోజు వారి హోమ్ వర్క్‌ లను పర్యవేక్షించడం, మాక్ టెస్ట్‌ లతో సమగ్ర ప్రిపరేషన్ చేయించటం తోనే ఈ ఘన విజయం సాధించామని తెలిపారు. ఈ విజయాలు అందరికీ ప్రేరణనిస్తాయని, తద్వారా విద్యార్థులు రాబోయే సంవత్సరాల్లో అద్భుత ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంటోనీ, హెచ్ ఆర్ లత , వైస్ ప్రిన్సిపాల్ సరిత ,అధ్యాపక బృందం, తల్లిదండ్రులు విద్యార్థులు  పాల్గొన్నారు.

A grand honor for NGS students