బదిలీపై వెళ్తున్న ఏఈవో కు ఘన సన్మానం

  నవీపేట్, బతుకమ్మ :   నవిపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)గా సేవలందించిన వసంత్ రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా శాటాపూర్ గ్రామానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నాళేశ్వర్ రైతు వేదికలో గ్రామస్థులు బుధవారం ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం, మున్నూరు కాపు సంఘ సభ్యులు, రైతులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి వసంత్ రాథోడ్‌కు శాలువా కప్పి, జ్ఞాపిక (మెమెంటో) అందజేసి వారి సేవలను...