Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 6:02 pm Posted by : ramakrishna

బదిలీపై వెళ్తున్న ఏఈవో కు ఘన సన్మానం

 

నవీపేట్, బతుకమ్మ :

 

నవిపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)గా సేవలందించిన వసంత్ రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా శాటాపూర్ గ్రామానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నాళేశ్వర్ రైతు వేదికలో గ్రామస్థులు బుధవారం ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం, మున్నూరు కాపు సంఘ సభ్యులు, రైతులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి వసంత్ రాథోడ్‌కు శాలువా కప్పి, జ్ఞాపిక (మెమెంటో) అందజేసి వారి సేవలను కొనియాడారు. అదేవిధంగా నాళేశ్వర్ గ్రామానికి నూతనంగా ఏఈవోగా బాధ్యతలు స్వీకరించిన దుంప విజయ్‌ను కూడా సన్మానించి మెమెంటో అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉపసర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు, వార్డు సభ్యులు గణేష్, రాజు, రైతులు ప్రవీణ్, గణేష్, రాజు, బోజన్న సంపత్, పోతన్న, మహేష్, సంజీవు, లింగారెడ్డి, బోజారం, సాయిలు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

 

A grand honor for AEO who is going on transfer