న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు

 బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలోని న్యాయస్థాన సముదాయంలో బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా న్యాయమూర్తులకు వీడ్కోలు పలికారు. ఇటీవల బదిలీ అయిన ఐదవ అదనపు న్యాయమూర్తి ఎస్. రవికుమార్, సీనియర్ సివిల్ జడ్జ్ దేవన్ అజయ్ కుమార్‌లను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, న్యాయమూర్తులు బోధన్ కోర్టుకు అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రాములు, ప్రధాన కార్యదర్శి కె. విద్యాసాగర్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు ఘన సన్మానం జరగింది. ఈ...