బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలోని న్యాయస్థాన సముదాయంలో బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా న్యాయమూర్తులకు వీడ్కోలు పలికారు. ఇటీవల బదిలీ అయిన ఐదవ అదనపు న్యాయమూర్తి ఎస్. రవికుమార్, సీనియర్ సివిల్ జడ్జ్ దేవన్ అజయ్ కుమార్‌లను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, న్యాయమూర్తులు బోధన్ కోర్టుకు అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రాములు, ప్రధాన కార్యదర్శి కె. విద్యాసాగర్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు ఘన సన్మానం జరగింది. ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్, మొదటి శ్రేణి అదనపు న్యాయమూర్తి సాయి శివ, రెండవ తరగతి స్పెషల్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి తదితరులు పాల్గొన్నారు. అలాగే బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వి.ఆర్. దేశాయ్, సంయుక్త కార్యదర్శి అప్సర్ పాష, కోశాధికారి కోటేశ్వరరావు, క్రీడా మరియు సాంస్కృతిక విభాగాధికారి డాక్టర్ సమ్మయ్య, గ్రంథాలయ కార్యదర్శి ఆరిపోద్ది, ఎగ్జిక్యూటివ్ సభ్యులు హాజరయ్యారు.
