Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 September 2025, 4:44 pm Posted by : ramakrishna

గణనాథుడికి ఘనంగా వీడుకోలు

  • ముగిసిన వినాయక ఉత్సవాలు

 

హైదరాబాద్, బతుకమ్మ: కిష్టారెడ్డి పేట లో వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమై ఘనంగా ముగిసాయి. శనివారం మధ్యాహ్నం తల్లి గంగమ్మా ఒడి కి చేరుకోవడం ప్రారంభమై ఆదివారం ఉదయం 8 గంటల వరకు నిమజనాలు కొనసాగాయి. కిష్టారెడ్డి పేట లో వినాయక ఉత్సవాల్లో భాగంగా ద్వారకా నగర్  కాలనీ వాసులు అన్నదాన ప్రసాద కార్యక్రమము నిర్వహించి అందరికి భోజనాలు ఏర్పాటు చేసారు. వసంత రెసిడెన్సీ వాసులు ఏర్పాటు చేసిన గణేష్ ప్రతిమ ప్రత్యేకంగా నిలిచింది. శోభాయాత్ర ఆద్యంతం వసంత గణేష్ ఉత్సాహ కమిటీ సభ్యులు చేసిన సాంప్రదాయక నాట్యాలు, కోలాటం, డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినాయక ఉత్సవాలను విజయ వంతం చేసిన కమిటీ సభ్యులు జొన్నల గడ్డ నాగేంద్ర బాబు, రజనీకాంత్, వేలంపాట లో వినాయక లడ్డు ని దక్కించుకున్న నట్టే లక్ష్మీనారాయణ, స్వామి వారి వస్త్రాలను తీసుకున్న మల్లేష్ లకు  అధ్యక్షలు ప్రభు కుమార్ ప్రత్యేక ధాన్యవాదాలు తెలిపారు. వసంత రెసిడెన్సి వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

A grand farewell to Lord Ganesha

A grand farewell to Lord Ganesha