నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా వ్యాప్తంగా దసరా పండుగను గురువారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో గ్రామస్తులంతా ఒక్కచోట చేరి జంబి కార్యక్రమం నిర్వహించి ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చెడుపై మంచి విజయానికి సూచికగా భావించే దసరా రోజు వాహన కొనుగోళ్లు, బంగారం కొనుగోళ్లు భారీగా జరిగాయి. అలాగే మంచిరోజు కావడంతో తమ కార్యక్రమాలకు ముహూర్తాలు పెట్టుకున్నారు. కొన్ని చోట్ల రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
