బతుకమ్మ, ఆర్మూర్ : లిల్లీపుట్ పాఠశాలలో దీపావళి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ సాంప్రదాయక దుస్తులతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లోని ఉపాధ్యాయ బృందం లక్ష్మీదేవికి పూజలు చేశారు. తదనంతరం విద్యార్థులందరూ టపాకాయలు చిచ్చుబుడులు లక్ష్మీ పటాకులతో సంతోషంగా కాల్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్తాండెడ్ రామకృష్ణ మాట్లాడుతూ దీపావళి పండగ ఎంతో ప్రాముఖ్యత కలిగిందని పండగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. పురాణ కథలు బాగా రాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత సీతాదేవి లక్ష్మణ్ తో కలిసి రాజ్యానికి వచ్చిన సందర్భంగా దీపావళిని జరుపుకుంటామని దీపావళి యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. తదనంతరం ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు స్వీట్స్ పంచారు. తర్వాత ఉపాధ్యాయ బృందానికి దీపావళి సందర్భంగా చక్కని బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపాల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.