Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 January 2025, 6:28 pm Posted by : ramakrishna

బోధన్ గౌడ్స్ కాలనీలో ఘనంగా ముగ్గుల పోటీలు

బోధన్, బతుకమ్మ  : బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ లోని గౌడ్స్ కాలనీలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని గౌడ్స్ కాలనీ సభ్యులు, బజరంగ్ దళ్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ తాజా మాజీ గవర్నర్ లయన్ వేమూరి లక్ష్మి హాజరయ్యారు. ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి మొదటి, దృతీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్ వేమూరి లక్ష్మి కూడా గెలుపొందిన వారికి వారి పక్షాన సహాయాన్ని బహుమతి రూపంలో అందించారు.  ఈ సందర్బంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. ముగ్గుల పోటీలను ఎంతో ఘనంగా నిర్వహించిన గణేష్ మండలి ఉత్సవ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ శ్యామ్ సుందర్ పహడే, గణేష్ మండలి ఉత్సవ కమిటీ సభ్యులు, గౌడ్స్ కాలనీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

A grand competition of trios in Bodhan Gouds Colony