ఆర్మూర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుక
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి పాస్టర్స్ భవన్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ తోపాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సంఘ కాపరుల కుటుంబాలతో కలిసి వినయ్ రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మండల దైవజనులు ఘనంగా సన్మానించారు. పాస్టర్ జాన్ వెస్లీ ఆనంద్...