వైభవంగా గ్రామ దేవతలకు ఎడ్ల బండ్ల ప్రదర్శన
లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట్ మండలంలోని పోల్కంపేట్ లో శుక్రవారం గ్రామ దేవతల ఆలయాల వద్ద ఎడ్లబండ్ల ప్రదర్శన వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గ్రామంలోని అన్ని కుల సంఘాల ఎడ్లబండ్లను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు చప్పులతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి ఎడ్ల బండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు...