Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 8:26 pm Posted by : ramakrishna

వైభవంగా గ్రామ దేవతలకు ఎడ్ల బండ్ల ప్రదర్శన

 

లింగంపేట్, బతుకమ్మ :

 

లింగంపేట్ మండలంలోని పోల్కంపేట్ లో శుక్రవారం గ్రామ దేవతల ఆలయాల వద్ద ఎడ్లబండ్ల ప్రదర్శన వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గ్రామంలోని అన్ని కుల సంఘాల ఎడ్లబండ్లను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు చప్పులతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి ఎడ్ల బండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దివిటి రమేష్, ఉపసర్పంచ్ లలితా విట్టల్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రాజశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాగరాజు, సంజీవరెడ్డి కృష్ణమూర్తి, వెంకటేశం, రమేష్, రాజు, శ్రీనివాస్, యాదగిరి, అనిల్, భాగయ్యతో పాటు ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

 

A grand bullock cart display for the village deities