Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 8:59 pm Posted by : ramakrishna

కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలకడగా నిలబడదు

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలకడగా నిలబడదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఏర్గట్ల మోర్తాడ్ సంయుక్త మండలాల కార్యదర్శి జి. కిషన్ అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు నరేంద్రమోడీ అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని పిలుపులో భాగంగా గురువారం మోర్తాడ్ మండలంలోని, ఎమ్మార్వో ఆఫీస్ గ్రౌండ్ నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005 సంవత్సరంలో వామపక్షాల ఒత్తిడితో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. కానీ నేడు బిజెపి ప్రభుత్వం ఆ చట్టాన్ని జి.రాంజీ పేరుతో మార్చి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయటం కోసమే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా పెట్టుబడిదారుల లాభాల కోసం విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చి రైతుల నడ్డి విరిసే విధంగా కృషి చేస్తుందని విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, విదేశాల నుంచి విత్తనాలు దిగుమతి చేసుకోవడానికి సవరణ చట్టం తీసుకురావడం విడ్డూరంగా ఉందని అన్నారు. దేశంలో పేదలు ఒకవైపు ధరలు పెరుగుతున్నప్పటికీ ఉపాధి అవకాశాలు లేక ఉన్న పరిశ్రమలు మూతపడతా ఉంటే వాటి గురించి ప్రభుత్వం ఆలోచించకుండా పెట్టుబడిదారుల పక్షాన చట్టాలు సవరణ చేయడం సిగ్గుచేటని అన్నారు. రానున్న రోజుల్లో కార్మిక కర్షక ఐక్యతతో ఉద్యమాలను ఉదృతం చేస్తామని మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దశరత్, గంగు, రాజమణి, లింగు, ముత్తక్క, రాములు, గంగన్న, ముత్తన్న బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

 

 

A government that is aligned with the workers will not stand firm.