Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 7:46 pm Posted by : ramakrishna

బాపూజీ వచనాలయ ఆస్తులపై ప్రభుత్వ విచారణ చేపట్టాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బాపూజీ వచనాలయ ఆస్తులపై ప్రభుత్వ విచారణ చేపట్టాలని బాపూజీ గ్రంథాలయం పరిరక్షణ కమిటీ కన్వీనర్ కోనేరు సాయికుమార్, సిపిఐ పార్టీ ఓమయ్య డిమాండ్ చేశారు. నగరంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నగరంలోని బాపూజీ వచనాలయాన్ని కాపాడాలని అన్ని పార్టీల సమక్షంలో పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకొని ముందటికీ వెళ్లడం జరుగుతుందని అన్నారు. గతంలో సారా, కల్లు లాంటి వాటిలో క్లోరోఫామ్, లైజోఫామ్ కలిపి ప్రజల చావుకు కారణమైన వ్యక్తులు గ్రంథాలయ నష్టానికి, సామాన్యుల్ని సైతం దరిదాపు రాకుండా చేస్తున్నారన్నారు. బాపూజీ వచనాలయం కమిటీలో చేరి చిలుక పలుకులు పలుకుతున్నారని అన్నారు. పుస్తకాలు అభివృద్ధి చేస్తామంటున్నారు ఎలా నమ్మేదన్నారు. ఎందుకంటే బాపూజీ వచనాలను 10 ఎకరాల స్థలం ఉంటే ఈరోజు ఎంత స్థలం మిగిలిందన్నారు. వచనాలయ భూములను కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. వచనాలయ ప్రాంగణంలోని కిరాయి మడుగులలో దక్కన్ వైన్స్ కళ స్థలాన్ని తాజా మాజీ అధ్యక్షులు ప్రస్తుత అధ్యక్షులు అని చెప్పుకుంటున్నటువంటి నాయుడు స్వయంగా 16 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. అంతకుముందు నారాయణరావు పవర్ ప్రింటింగ్ ప్రెస్ స్థలాన్ని అమ్మినారని, అది కోర్టు కేసులో ఇప్పటికీ ఉన్నదని అన్నారు. కాబట్టి బాపూజి వచనాలయ స్థలాన్ని, నిధులను, పుస్తక బాండాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత నిజామబాద్ పట్టణ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉన్నదని గుర్తు చేశారు. స్వాతంత్రం కన్నా ముందు నుంచి ఇప్పటివరకు ఈ లైబ్రరీ ద్వారా ఎంతోమంది ఉన్నత చదువులు చదివారని అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి పేరుతో కూల్చి షోరూంలో అమ్ముకోవాలని పాలకవర్గంలో చేరిన వారి నైజాం అని తెలిపారు. ప్రజలందరూ వీరికి వ్యతిరేకంగా బాపూజి వచనాలయ ఆస్తులను అందరూ పరిరక్షణ సమితి బలపరిచి తమ సహకారం అందించాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం జరిగిన ఎన్నికలను రద్దుచేసి  పూర్తిస్థాయి సభ్యులను చేర్చుకొని ఎన్నికలను నిర్వహించాల్సిందిగా, జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని గ్రహించి సమస్య పరిష్కరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సిర్ప లింగం, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ఏఐఎస్ఎప్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామ్, నవీన్, నరేష్తదితరులు పాల్గొన్నారు.

A government inquiry should be conducted on the assets of Bapuji Vachanalaya