Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2025, 1:28 pm Posted by : ramakrishna

కామారెడ్డిలో ఘనంగా గణతంత్రం

. . . జాతీయ జండాను ఎగురవేసిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ:

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని  కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తొలుత కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పతాకావిష్కరణ గావించినారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయంలో పతాకావిష్కరణ గావించినారు. అనంతరం కలెక్టరేట్ లో జరిగిన వేడుకలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , ఎస్పీ సింధు శర్మలు పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పతాకావిష్కరణ చేశారు.

A glorious republic in Kamareddy

తదుపరి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ  కార్యక్రమాలపై కలెక్టర్ సందేశం లో వివరించారు. అనంతరం రాజంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాన్సువాడ బి.సి.హాస్టల్ విద్యార్థినిలచే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

A glorious republic in Kamareddy

ఆ తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు జ్ఞాపికలను కలెక్టర్ అందజేశారు. సి.ఏం.కప్ క్రీడోత్సవాల నిర్వహణ కోసం విరాళాలు అందించిన సఫల ఫార్మా ఇండస్ట్రీస్ ఏం.డి. పైడి ఎల్లారెడ్డి, గాయత్రి షుగర్స్ ఏం.డి. వేంకటేశ్వర రావు లను సత్కరించారు. అనంతరం సి.ఏం. కప్ క్రీడల్లో విజేతలకు బహుమతి ప్రదానం, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు.

A glorious republic in Kamareddy

ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి,అసిస్టెంట్ ఎస్.పి. చైతన్య రెడ్డి, జిల్లా అటవీ అధికారిణి నిఖిత, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, అధికారులు,  పలు శాఖల ఉద్యోగులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

A glorious republic in Kamareddy