ఆవులకు ఎత్తుకెళ్తున్న ముఠా గుట్టురట్టు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తుమందు ఇంజిక్షన్లు ఇచ్చి ఆవులకు ఎత్తుకెళ్తున్న ముఠా గుట్టురట్టు చేసినట్లు సీసీఎస్ ఇన్స్ పెక్టర్ సురేష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై ఉండే ఆవులను మత్తు మందు ఇచ్చి ఇన్నోవాలో ఎత్తుకెళ్తున్నారనే సమాచారంతో సీసీఎస్ ఇన్​స్పెక్టర్​ సురేశ్​ తన సిబ్బంది యాదగిరి, సుభాష్​, నీలేష్​, నరేశ్​లతో కలిసి నిఘా ఉంచారు. అనంతరం మహారాష్ట్రలోని దెగ్లూర్​లో ఆరుగురు నిందితులు సయ్యద్​ ఉమర్​, సయ్యద్​ ఆమేర్​, అబ్దుల్​ కలామ్​, సయ్యద్​...