బతుకమ్మ, మాక్లూర్ : మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘంలో భారీ అక్రమాలు జరిగాయని వాటిని తక్షణమే రికవరీ చేయాలంటూ మండలంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మాజీ చైర్మన్ గోపు లక్ష్మి, కార్యదర్శి సంతోష్ నూతన చైర్మన్ అశోక్ పాలక వర్గం సభ్యులు లక్షల్లో ప్రాథమిక సహకార సంఘం లో అక్రమాలు చేశారని ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ కార్యదర్శి తొలగించారు. నూతన చైర్మన్ ను 2024 ఫిబ్రవరిలో మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘానికి నూతన చైర్మన్ భూరోల్ల అశోక్ ఎన్నుకున్నారు. చైర్మన్గా తనంటే గిట్టని వారు ఎలాగైనా చైర్మన్ పదవి నుంచి భూరోల్ల అశోక్ తొలగించాలని ఉద్దేశంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని నూతన చైర్మన్ అశోక్ పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. తను చైర్మన్గా 2024 ఫిబ్రవరిలో ఎక్కిన నాటి నుండి ఈరోజు వరకు ఇలాంటి అక్రమాలు జరగకుండా బాధ్యతాయుతంగా చైర్మన్ పదవి నిర్వహించాలని నేనంటే గిట్టని వాళ్ళు రైతులకు లేనిపోని అపోహలు కల్పిస్తూ పాలకవర్గాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ పాలకవర్గాన్ని తొలగించాలంటే రైతులతో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. పదవి కాలం నాటి నుండి అక్రమాలు చేశాను అని తెలితే తన సొంత ఆస్తినైనా అమ్మి సొసైటీకి చెల్లించి రాజీనామా చేసి బయటకెళ్ళిపోతారని సవాల్ విసిరాడు. మాజీ చైర్మన్ హయాంలో నాలుగు సంవత్సరాల కాలంలో కోట్ల పైగా అక్రమాలు జరిగాయని జిల్లా ఉన్న అధికారులకు ఫిర్యాదు అందాయి. దీంతో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమావతి చాలా రోజులు విండో పై విచారణ జరిపారు. కార్యదర్శి ఏకంగా 53.13 లక్షలు కాజేసినట్టు విచారణలో తేలింది.అలాగే మాజీ చైర్మన్ లక్ష్మి,పాలకవర్గం సభ్యులు లక్షల్లో అవినీతి చేసింది అని ఆరోపణలు కూడా ఉన్నాయి. నాలుగు సంవత్సరాల కాలంలో లక్షల్లో అక్రమాలు జరిగిన ఎటువంటి రగడ జరగకుండా ఎలా ఉన్నారని హెచ్చరించారు. కొందరు కుట్రపూరితంగానే అసత్య ప్రచారాలు చేస్తూ అక్రమాలు చేశారంటూ ఫ్లెక్సీలు పెట్టడం సమంజసం కాదని వారన్నారు. బాధ్యతాయుతంగా చైర్మన్ పదవిని నిర్వహిస్తూ రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉన్న తనపై అసత్య ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు. విండో చైర్మన్ పదవి చేపట్టిన నాటి నుండి ఈ రోజు వరకు ఎలాంటి అక్రమాలు జరగలేదని వారన్నారు. అక్రమాలకు జరగాయని నిరూపిస్తే తన ఆస్తినైనా అమ్మి నయా పైసా తో చెల్లించి చైర్మన్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్ విసిరాడు. ఈ సమావేశంలో చైర్మన్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.