Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2025, 4:56 pm Posted by : ramakrishna

కౌలాస్ ఖిల్లాపై రెప రెపలాడిన మువ్వన్నెల జెండా

జుక్కల్, బతుకమ్మ: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని చారిత్రాత్మక కౌలాస్ కోట మీద జాతీయ జెండా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎగురవేశారు. అనంతరం కౌలాస్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన శుభదినాన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

A flag of three moons fluttering over the fort of Kaulas