. . . అగ్ని మాపక అధికారి టి.పరమేశ్వర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అగ్ని భద్రతపై అవగాహన కలిగి ఉన్న సమాజం అవసరమని జిల్లా అగ్ని మాపక అధికారి టి.పరమేశ్వర్ అన్నారు. అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా బుధవారం అగ్ని మాపక అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని అగ్ని మాపక కేంద్రాల పరిధుల్లోని పబ్లిక్ ప్లేసేస్, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ లలో అగ్ని మాపక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాల నివారణ కోసం, సురక్షిత పాఠశాల, సురక్షితమైన ఆసుపత్రి, అగ్ని భద్రతపై అవగాహన కలిగిన సమాజం అవసరం అనే నినాదంతో ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అగ్ని మాపక అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
