అక్బర్ నగర్ గుట్టల్లో పత్తాలాట

చేతులు మారుతున్న లక్షల రూపాయలు రుద్రూర్, బతుకమ్మ: దీపావళి పండుగ రాకముందు నుండే రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గుట్ట ప్రాంతంలో జోరుగా పత్తాలాట కొనసాగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. పేకాటరాయుళ్లు, నిర్వాహకులు గ్రామస్తులకు కనబడకుండా గ్రామ శివారులోని గుట్ట ప్రాంతాలను అడ్డాగా చేసుకుంటున్నారు. పేకాటరాయుళ్లను మచ్చిక చేసుకొని కొందరు వ్యక్తులు టీములుగా ఏర్పడి పేకాటను నిర్వహిస్తూ లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. మందు, విందు ఆట వద్దే.. పేకాట అంటేనే క్రేజీ గేమ్‌గా మారింది. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు పేకాట...