ఎంఈఎస్ ప్రొబెషనరీ అధికారుల బృందం క్షేత్రస్థాయి అధ్యయనం
అదనపు కలెక్టర్ తో భేటీ నిజామాబాద్, బతుకమ్మ : తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్ కు కేటాయించబడిన మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రొబెషనరీ అధికారుల బృందం శనివారం జిల్లాకు చేరుకుంది. 30 మందితో కూడిన అధికారుల బృందం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ అంకిత్ తో ఆయన ఛాంబర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయి అధ్యయనం సందర్భంగా వివిధ వర్గాల వారి కోసం...