Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 September 2025, 4:44 pm Posted by : ramakrishna

మహిళా సభ్యురాలికి రూ.14 లక్షల లబ్ధి

బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటాకలాన్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో, పెగడపల్లి గ్రామానికి చెందిన మేడి మల్లవ్వ పది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మహిళా సభ్యురాలు కావడంతో మహిళ సమైక్య సంఘం గ్రూపు నుండి రూ.10 లక్షలు, అలాగే బ్యాంక్ ఖాతా ఉండడం వల్ల బ్యాంక్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.4 లక్షలు, మొత్తంగా రూ.14 లక్షల లబ్ధి చెల్లింపుచేయబడింది. మృతురాలి భర్త, కొడుకు పేర్లపై ఫిక్స్‌ డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ గీతా, బ్యాంకు సిబ్బంది ఉదయ్, దినకర్, రవికుమార్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధి సోనీ సాయి, మహిళా సభ్యులు లక్ష్మీ, అనిత తదితరులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు బ్యాంకు అధికారులకు, మహిళా సంఘ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, వీడీసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మేడి రవి, కృష్ణారెడ్డి, రాజారెడ్డి, పోతారెడ్డి, గంగాధర్, అశోక్, సాయిలు తదితరులు హాజరయ్యారు.