లఖ్ నవూ, బతుకమ్మ: మహాకుంభ మేళ సందర్భంగా 45 రోజులపాటు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో బోట్లు నడిపిన ఓ కుటుంబం ఏకంగా రూ.30 కోట్ల ఆదాయాన్ని అర్జించిందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. బోట్లు నడిపిన వ్యక్తులు దోపిడీకి గురయ్యారని సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో యోగి ఈ ప్రకటన చేశారు. ఓ వ్యక్తి కుటుంబానికి మొత్తం 130 పడవలు ఉండగా, ఒక్కో పడవ ద్వారా రోజుకు రూ.50వేలకుపై ఆదాయాన్ని సమకూరిందన్నారు. ఈ లెక్కన 45రోజుల్లో 130 పడవల ద్వారా రూ.30కోట్ల ఆదాయాన్ని ఆ వ్యక్తి కుటుంబం ఆర్జించిందన్నారు. ప్రభుత్వం కుంభ మేళా నిర్వహణకు రూ.7,500 కోట్లు ఖర్చు చేయగా, సుమారు రూ.3లక్షల వ్యాపార లావాదేవీలు జరిగాయని యోగి వివరించారు.