కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

తాడ్వాయి, బతుకమ్మ: సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహఇంచాలని, ప్రతి కుటుంబానికి సంబంధించి వివరాలను పక్కాగా సేకరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో చేపట్టిన సర్వేను కలెక్టర్ పర్యవేక్షించారు. ముఖ్య ప్రణాళిక అధికారి రాజారాం, మండల పరిషత్ అధికారి సబిత, తదితరులు ఆయన వెంట ఉన్నారు. కొనుగోలు కేంద్రం పరిశీలన సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, ట్యాబ్ లో వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. ఎండ్రియాల్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్...