Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 10:12 am Posted by : ramakrishna

డబ్బు ఇస్తే కోర్టు కు డూప్లికేట్ వ్యక్తి హాజరు

 

. . . ఫేక్ చలాన్లతో రికార్డుల మాయాజాలం

 . . . జైలు భయాన్ని ఆసరాగా చేసుకుని భారీగా వసూళ్లు

. . . ఒక్కో కేసులో రూ. 15 వేల నుంచి 30  వేల  వసూల్

. . . సీపీ ఆదేశాల విచారణ.. ఒకరు సస్పెండ్, ఇద్దరిపై దర్యాప్తు

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అంటే అందరికీ భయం.. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలలో చాలమటుకు మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపడం వలన జరుగుతున్నాయి. దానితో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపట్ల చట్టాలు కఠినంగా వ్యవహరించాలని గత ఎడాది పెను మార్పులు చేసింది. తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన రూ.10 వేల జరిమానా మొదలుకొని కొన్ని సార్లు మద్యం మోతాదు( పదే పదే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే) 2 రోజుల నుంచి 10 రోజు వరకు జైలు శిక్ష అనుభవించాల్సిందే.. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లో దొరికితే ఇక జరిమానా లేదా జైలుకు అనే భయం ప్రజలు పెరిగింది. దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు ఖాకీలు. ఎకంగా న్యాయస్థానాలకు మస్కా కోరుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారి స్థానంలో ఇతరులను మందుబాబులు చూపించడంతో పాటు , పేక్ చలనాలతో ప్రభుత్వ ఆధాయంకు గండి కొడుతున్నారు.. ఇలాంటి వ్యవహరం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

మద్యం తాగి వాహనం నడిపే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీస్ సిబ్బంది ఇప్పుడు అక్రమ దందా కు పాల్పడడం కరీంనగర్ పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిని కోర్టుకు హాజరు కాకుండా చేస్తామని, జైలు శిక్ష పడకుండా చూస్తామని నమ్మబలికి, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు పోలీసు వర్గాలు సంచలనంగా మారాయి. అసలు నిందితులు స్థానంలో ఇతరులను కోర్టుకు పంపడం, ఫేక్ చలాన్లతో రికార్డులు మాయం చేయడం వంటి వ్యవహారాలు పడుతుందనే భయాన్ని కొందరు సిబ్బంది తమకు అదనుగా మార్చుకున్నారు. “డబ్బులిస్తే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు, అన్నీ మేమే చూసుకుంటాం” అని నమ్మబలికి ఒక్కో కేసు విషయంలో రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు చెల్లించిన వారి కోసం, వారి స్థానంలో కోర్టుకు హాజరయ్యే డూప్లికేట్’ వ్యక్తులను సమకూర్చి న్యాయ ప్రక్రియను తప్పుదోవ పట్టించి నట్లు సమాచారం. గుర్తింపు పత్రాలు ధృవీకరణ కూడా అవకతవకలు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు

ఈ వ్యవహారంలో చలాన్ల జారీ విధానం ఎంత మొత్తం అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారు? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. అసలు నిందితులు స్థానంలో హాజరైన ఆ డూప్లికేట్ వ్యక్తులు ఎవరు? వారికి ఎవరు డబ్బులు ఇచ్చారు? అనే ప్రశ్నలకు ఇప్పుడు కమిటీ సమాధానాలు వెతుకుతోంది. బ్రీత్ అనలైజర్ రికార్డులను, కోర్టు హాజరు వివరాలు సరిపోల్చుతూ ఈ అవినీతి సామ్రాజ్యం ఎంత విస్తృతమైనదో బయటపడుతుందని అధికారులు భావిస్తున్నారు.ఈ అక్రమాలపై ఫిర్యాదులు అందటంతో పోలీస్ కమిషనర్ గౌడ్ ఆలం వెంటనే స్పందించారు. ఏఆర్ ఏసీపీ సి. ప్రతాప్ నేతృత్వంలో ముగ్గురు అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఇద్దరు కానిస్టేబుళ్లను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. అందులో ఒక కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడగా, మిగతా వారిపై విచారణ కొనసాగుతోంది. ఈ అక్రమాల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదు” అని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. కేవలం ఒక కానిస్టేబుల్ సస్పెన్షన్ తో ఈ కేసు ముగిసిపోకూడదని, ఎన్ని కేసుల్లో ఈ విధంగా అక్రమాలు జరిగాయి, ఇందులో మరెవరి పాత్ర ఉంది?అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. న్యాయ ప్రక్రియను అపహాస్యం చేసిన ఈ ఉదంతం, కరీంనగర్ పోలీసు శాఖలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

A duplicate person appears in court if paid