Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2024, 11:09 pm Posted by : ramakrishna

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టేది

– అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న సంబంధిత అధికారులు
– పోలీసు బందోబస్తుతో  ఇసుక రవాణా

కామారెడ్డి జిల్లా-బాన్సువాడ నియోజకవర్గంలొ కంచే చేను మేస్తే కాపలదారులు ఎవరు.. అన్నట్లుగా అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులకు కొమ్ము కాస్తే ఇక వారి వ్యాపారానికి అడ్డుపడేది ఎట్లా ?

నిజామాబాద్, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో గల మంజీరా నది నుండి అర్ధరాత్రులు దర్జాగా ఇసుక రవాణా జరుగుతుంది. బీర్కూర్, కోటగిరి మండలల పరిధిలో గల మంజీరా నది నుండి అర్ధరాత్రి అయింది అంటే చాలు పోలీసుల బందోబస్తుల మధ్యన ఇసుక రవాణా జరుగుతుంది. ఈ రవాణాకు అండగా ఉంటున్న పోలీసులకు కమిషన్లు అందుతున్నాయంటూ నియోజకవర్గం లో చర్చలు జరుగుతున్నాయి. గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రజాప్రతినిధులుగా కొనసాగిన వారు ప్రస్తుతం అధికార పార్టీలో చేరడంతో వారికి అడ్డుపడే వారే లేకుండా పోయారు. ఉమ్మడి బీర్కూరు మండలంలో టిప్పర్లొ తీసుకొని బాన్సువాడ ఎల్లారెడ్డి.గాంధారి తొ పాటు మెదక్ హైదరాబాద్ వరకు తరలించాలంటే రహదారి పొడవున ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ కూడా వారికి అండగా నిలుస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. సంబంధిత నాయకులపై ఫిర్యాదు చేస్తే వారి అంతు చూస్తామంటూ ఆ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఒక్క టిప్పర్ ధర ₹ 70. వేల వరకు పలుకుతుంది. ప్రతి రాత్రి పదుల సంఖ్యలో టిప్పర్లు ఒకేసారి వెళుతున్న కూడా సంబంధిత వ్యాపారస్తులపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం విడ్డూరం.

బీర్కూర్ లో డంపులు చేస్తూ అర్ధరాత్రులు తరలిస్తున్న వైనం..

A deterrent to sand smuggling

ఉమ్మడి బీర్కుర్ మండలం వ్యాప్తంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్ లుచేస్తూ అర్ధరాత్రిలూ లారీలు టిప్పర్ల ద్వారా వాటిని తరలిస్తున్నారు. అధికార పార్టీ నాయకులే ఉండడంతో . అర్ధరాత్రిలు జెసిపిల ద్వారా టిప్పర్లలోను ఇసుకను నింపి హైదరాబాద్ కు తరలిస్తున్నారు పోలీసుల బందోబస్తు మధ్యన తరలిస్తున్నారు .ఈ తరలింపునకు సహకరిస్తున్నా పోలీసులైన సిఐ ఎస్ఐకి ముడుపులు అందిస్తున్నట్టు వినిపిస్తుంది. సామాన్యునికి ఒక ట్రాక్టర్ ఇసుక దొరకాలంటే సవాలక్ష నిబంధనలు అడ్డు వస్తాయి కానీ అధికార పార్టీ నాయకులకు మాత్రం అర్ధరాత్రి లో ఇసుక యదేచ్చగా రవాణా జరగడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో ప్రతి చిన్న విషయానికి స్పందించే నాయకుడు ఇటువంటి అక్రమ వ్యాపారం జరుగుతుందని తెలియకుండానే ఉన్నాట్లు వివరిస్తున్నారా..అని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై బీర్కూరు తాసిల్దార్ మరియు సంబంధిత పోలీసు అధికారులకు వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని వస్తే అక్రమ ఇసుక ను అడ్డుకుంటామన్నట్లు మాటలతొ దాటిస్తున్నారు.

A deterrent to sand smuggling