Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 10:17 am Posted by : ramakrishna

పెళ్లింట తీవ్ర విషాదం

 

. . . రెండు రోజుల్లో పెళ్లి రోడ్డు ప్రమాదంలో వరుడి తండ్రి దుర్మరణం

 లింగంపేట, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లాలో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయ్యపల్లి వద్ద దుర్గయ్య బైక్ ని లారీ ఢీ కొట్టగా అతను  అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో షేట్ పల్లి లో పెళ్ళింట విషాద చాయలు అలుముకున్నాయి. దుర్గయ్య కొడుకు రెండు రోజుల్లో ఉండగా  సరుకుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో  దుర్మరణం చెందడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీ ని ఆసుపత్రికి తరలించారు.