బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని ఎన్ హెచ్ 44 టోల్ ప్లాజా లో సంక్రాంతి సందర్భంగా సెలవులు రావడంతో ఆదివారం సాయంత్రం టోల్ ప్లాజా కిక్కిరిసి పోయింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాదు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు దారులకు ట్రాఫిక్ జాం కాకుండా భిక్కనూరుటోల్ ప్లాజా యాజమాన్యం ప్రత్యేక ఏర్పాటు చేశారు. టోల్ ప్లాజా లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై ఆంజనేయులు బందోబస్తు నిర్వహించారు.