కార్మికుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కార్మికుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC అనుబంధం) ఆధ్వర్యంలో శనివారం సమావేశం పి.సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంటాక్ట్...