Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 June 2025, 4:40 pm Posted by : ramakrishna

కార్మికుల  సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

  • ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కార్మికుల  సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్  యూనియన్ (AITUC అనుబంధం) ఆధ్వర్యంలో శనివారం సమావేశం పి.సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంటాక్ట్ విధానాన్ని తొలగించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్మికుల వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో గత వేతనాల టెండర్ కాలపరిమితి ముగుస్తున్నందున కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేతనాలు,ఇతర సమస్యలు పరిష్కరించాలని, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని 1000 పడకలకు పెంచి కార్మికుల సంఖ్యను పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి, స్వరూప, భారతి, వెంకటేష్, రాధా కుమార్ కార్మికులు పాల్గొన్నారు.

A corporation should be formed for the welfare of workers.