Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2025, 10:39 am Posted by : ramakrishna

ట్రాక్టర్ ను ఢీకొట్టిన కంటైనర్

 

. . . ఇద్దరి దుర్మరణం

. . . ఇద్దరికి గాయాలు

 జక్రాన్ పల్లి, బతుకమ్మ :

 

జాతీయ రహదారిపై పశుగ్రాసం తో వెలుతున్న ట్రాక్టర్ ను కంటైనర్ డికోట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి జక్రాన్ పల్లి మండలం పడకల్ చాంద్ మియా బాగ్ వద్ద జరిగింది. డిచ్ పల్లి మండలం అమృత పూర్ కు చెందిన ఓడ్డేన్న(45), రాజేశ్వర్ (46), విజయ్, మహేష్ లు జోన్నసోప్ప ట్రాక్టర్ ట్రాలీ లో వేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీ ని కంటైనర్ ఢీకొట్టడంతో అది బోల్తా పడింది. అందులో ఉన్న ఓడ్డేన్న, రాజేశ్వర్ లు స్పాట్ లో చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ మేరకు జక్రాన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

A container hit by a tractor