తప్పిదాలకు తావులేకుండా సమగ్రంగా డిజిటల్ కార్డుల సర్వే

నిజామాబాద్ జిల్లా  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ : కుటుంబ సభ్యుల వివరాల సేకరణ, డిజిటల్ కార్డుల జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని డిచ్పల్లి మండలం సాంపల్లిలో, ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మున్సిపల్ వార్డు నెంబర్-2 పరిధిలో కొనసాగుతున్న డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్యామిలీ డేటా...