Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 5:42 pm Posted by : ramakrishna

వ్యవసాయ కూలీల కోసం సమగ్ర చట్టాన్ని తీసుకురావాలి

 

. . . ఏఐపికెఎంఎస్జిల్లా అధ్యక్షులు కె.గంగాధర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని ఏఐపికెఎంఎస్జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.గంగాధర్, డి.గంగమల్లు అన్నారు. గురువారం కోటగల్లిలోని ఎన్.ఆర్ భవన్ లో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు సంవత్సరంలో కనీసం 200 రోజులు పని కల్పించాలన్నారు. ఉపాధి కూలీ రోజుకు 600 రూపాయలు ఇవ్వాలన్నారు. ఉపాధి కూలీలు మరణిస్తే,వారికి 15 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలను సాంకేతిక కారణాలతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. జీరాంజీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసే కుట్రలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అదే పేరుతో కొనసాగించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐపికెఎంఎస్జిల్లా ఉపాధ్యక్షులు ఒడ్డెన్న, జిల్లా కోశాధికారి షేక్ నసీర్, జిల్లా నాయకులు రమేష్, రాజలింగం, దేవయ్య, సీ.హెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

A comprehensive law should be brought for agricultural laborers.